మంగళవారం అర్ధరాత్రి జరిపిన షూటింగ్‌లో ‘సుడిగాలి’ సుధీర్, ‘జబర్దస్త్’ శ్రీను, హీరో, హీరోయిన్లపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. మూడవ రోజు(బుధవారం) షూటింగ్‌లో ‘తాగుబోతు’ రమేశ్, ‘షకలక’ శంకర్‌లు చిత్రంలో నటించడానికి సంసిద్ధతను వ్యక్తం చేయడంతో వారి సన్నివేశాలకు సంబంధించిన సీన్లు, డైలాగ్స్ సిద్ధం చేశారు. ఇప్పటివరకూ చిత్రీకరించిన సన్నివేశాలకు సంబంధించి ఆన్‌లైన్ ఎడిటింగ్, డీఐ తదితర కార్యక్రమాలను లొకేషన్‌లోనే పూర్తి చేసి సౌండ్ ఎఫెక్ట్స్, రీరికార్డింగ్ విభాగాలకు పంపించారు. ఈ చిత్రానికి అవసరమైన ఓ పాట రికార్డింగ్‌ను సంగీత దర్శకుడు సుమన్ జూపూడి పూర్తి చేశారు. గిన్నిస్ బుక్ రికార్డు నిబంధనలకు అనుగుణంగా సాగుతున్న ఈ షూటింగ్‌ను న్యాయవాది పరమేశ్వర్ రావు పర్యవేక్షించారు.