చరిత్రాత్మకమైన గుత్తి కోటలో అప్పటి పాలకులు వినియోగించిన ఫిరంగులను కొంత కాలం క్రితం స్థానికులు వెలికి తీశారు. వీటిపై అవగాహన కల్పించేందుకు శుక్రవారం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో వీటిని ప్రదర్శించారు.
గుత్తి, న్యూస్‌లైన్: చరిత్రాత్మకమైన గుత్తి కోటలో అప్పటి పాలకులు వినియోగించిన ఫిరంగులను కొంత కాలం క్రితం స్థానికులు వెలికి తీశారు. వీటిపై అవగాహన కల్పించేందుకు శుక్రవారం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో వీటిని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఫిరంగులను వెలికితీసేందుకు కృషి చేసిన ట్రాన్స్‌కో సిబ్బంది, కోట పరిరక్షణ సమితి నాయకులు, ప్రజలను పూలమాలలతో అభినందించారు.
ఈ సందర్భంగా కోట పరిరక్షణ సమితి నాయకులు మాట్లాడుతూ ఫిరంగులకు కోట క్రింద భాగంలో ఉన్న సమాధుల వద్ద ఉంచి రక్షణ కల్పిస్తామని తెలిపారు.ర్యక్రమంలో కోట పరిరక్షణ సమితి నాయకులు జయరంగారెడ్డి,నాగేంద్ర ప్రసాద్,చిన్నా,108 శ్రీనా, రఫీ,ఆచారి పాల్గొన్నారు.