నాగేంద్రప్రసాద్ చిత్రం మూడో రోజు విశేషాలు | Nagendra Prasad movie third day Updates | Sakshi
Sakshi News home page

నాగేంద్రప్రసాద్ చిత్రం మూడో రోజు విశేషాలు

Oct 15 2014 11:23 PM | Updated on Aug 21 2018 2:34 PM

నాగేంద్రప్రసాద్ చిత్రం మూడో రోజు విశేషాలు - Sakshi

నాగేంద్రప్రసాద్ చిత్రం మూడో రోజు విశేషాలు

మంగళవారం అర్ధరాత్రి జరిపిన షూటింగ్‌లో ‘సుడిగాలి’ సుధీర్, ‘జబర్దస్త్’ శ్రీను, హీరో, హీరోయిన్లపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. మూడవ రోజు(బుధవారం) షూటింగ్‌లో

 స్కిప్ట్ టు స్క్రీన్
 గిన్నిస్‌బుక్ రికార్డు కోసం నాగేంద్రప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం
 మూడో రోజు విశేషాలు
 
  మంగళవారం అర్ధరాత్రి జరిపిన షూటింగ్‌లో ‘సుడిగాలి’ సుధీర్, ‘జబర్దస్త్’ శ్రీను, హీరో, హీరోయిన్లపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.
  మూడవ రోజు(బుధవారం) షూటింగ్‌లో ‘తాగుబోతు’ రమేశ్, ‘షకలక’ శంకర్‌లు చిత్రంలో నటించడానికి సంసిద్ధతను వ్యక్తం చేయడంతో వారి సన్నివేశాలకు సంబంధించిన సీన్లు, డైలాగ్స్ సిద్ధం చేశారు.
  ఇప్పటివరకూ చిత్రీకరించిన సన్నివేశాలకు సంబంధించి ఆన్‌లైన్ ఎడిటింగ్, డీఐ తదితర కార్యక్రమాలను లొకేషన్‌లోనే పూర్తి చేసి సౌండ్ ఎఫెక్ట్స్, రీరికార్డింగ్ విభాగాలకు పంపించారు.
  ఈ చిత్రానికి అవసరమైన ఓ పాట రికార్డింగ్‌ను సంగీత దర్శకుడు సుమన్ జూపూడి పూర్తి చేశారు.
  గిన్నిస్ బుక్ రికార్డు నిబంధనలకు అనుగుణంగా సాగుతున్న ఈ షూటింగ్‌ను న్యాయవాది పరమేశ్వర్ రావు పర్యవేక్షించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement