నాగేంద్రప్రసాద్ చిత్రం ఎనిమిదో రోజు విశేషాలు | Nagendra Prasad movie Eighth day Updates | Sakshi
Sakshi News home page

నాగేంద్రప్రసాద్ చిత్రం ఎనిమిదో రోజు విశేషాలు

Oct 21 2014 1:03 AM | Updated on Jul 11 2019 6:22 PM

నాగేంద్రప్రసాద్  చిత్రం ఎనిమిదో రోజు విశేషాలు - Sakshi

నాగేంద్రప్రసాద్ చిత్రం ఎనిమిదో రోజు విశేషాలు

సోమవారం నాడు చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా సాగాయి. ఒకపక్క ఎడిటింగ్, మరోపక్క డబ్బింగ్, వేరొకపక్క రీ-రికార్డింగ్, అలాగే డి.ఐ. కార్యక్రమాలు ఏకకాలంగా జరిగాయి.

 గిన్నిస్‌బుక్ రికార్డు కోసం నాగేంద్రప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం
 ఎనిమిదో రోజు విశేషాలు
 సోమవారం నాడు చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా సాగాయి. ఒకపక్క ఎడిటింగ్, మరోపక్క డబ్బింగ్, వేరొకపక్క రీ-రికార్డింగ్, అలాగే డి.ఐ. కార్యక్రమాలు ఏకకాలంగా జరిగాయి.
 చిత్ర ఎడిటింగ్ పూర్తి అయింది.
 కథానాయిక మధూ లగ్నదాస్ మినహా ఇతర హీరో హీరోయిన్లు, చిత్రంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న బుల్లితెర నటుడు కృష్ణ కిశోర్ (కె.కె) సొంతంగా డబ్బింగ్ చెప్పున్నారు.
 సౌండ్ ఎఫెక్ట్‌ల పని దాదాపు 75 శాతం పూర్తయ్యింది. సోమవారం రాత్రి పొద్దుపోయే సమయానికి రీ-రికార్డింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి కావచ్చాయి.
 - వేరొక పక్క డి.ఐ. కొనసాగుతోంది.
 ‘‘నేను గతంలో ‘యువసేన’, ‘కిల్లర్’, ‘పోస్ట్‌బాక్స్’, ‘గణేష్’ తదితర చిత్రాల్లో నటించాను. అయితే, గిన్నిస్‌లోకి ఎక్కే ఇలాంటి సినిమాలో అవకాశం రావడం ఉద్వేగానికి గురి చేస్తోంది. అందులోనూ కథకు అత్యంత కీలకమైన పాత్ర నాది’’
 - కె.కె.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement