రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా జె.ఎస్.సహారియాకి అవకాశమిచ్చారు. ఇప్పటిదాకా ఉన్న జయంత్‌కుమార్ భాటియా పదవీ విరమణ చేయడంతో సహారియా నియామకానికి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అంగీకరించారు.
	 సాక్షి, ముంబై:
	 రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా జె.ఎస్.సహారియాకి అవకాశమిచ్చారు. ఇప్పటిదాకా ఉన్న  జయంత్‌కుమార్ భాటియా పదవీ విరమణ చేయడంతో సహారియా నియామకానికి  ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అంగీకరించారు. ఆరు నెలల క్రితమే భాటియా  పదవీ కాలం ముగిసినా మరో ఆరు నెలల పాటు సర్కార్ పొడిగించడంతో నవంబర్ 30 వరకు ఆ పదవిలో కొనసాగారు. మళ్లీ గడువు పొడిగించాలని భాటియా ప్రయత్నాలను చవాన్ పట్టించుకోలేదు. ఈ స్థానంలో రాజన్‌ను నియమించాలని ముందుగా చవాన్ భావించారు. అయితే ఎన్నికలు సమీపిస్తుండడంతో అనవసరంగా ప్రత్యర్థులకు వి మర్శలు చేసేందుకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు.
	 
	  సీని యార్టీ ప్రకారమే సహారియాను నియమించామని చవాన్ స్పష్టం చేశారు.  1978 బ్యాచ్‌కు చెందిన ఉత్తరప్రదేశ్ వాసిసహారియా మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారి. ఆయన 1992-1995 వరకు ఢిల్లీలో హోంశాఖ డిప్యూటీ కార్యదర్శిగా పనిచేశారు. పర్భణి కలెక్టర్, నాగపూర్ కార్పొరేషన్ కమిషనర్, నాగపూర్ రీజియన్ కమిషనర్, మంత్రాలయలో వ్యవసాయ, రెవెన్యూ, అటవీ, ఉన్నత సాంకేతిక విద్యా తదితర కీలక శాఖల్లోని పదవుల్లో పనిచేశారు. ఆయన 2014 ఆగస్టులో పదవీవిరమణ చేయనున్నారు. దీంతో ఆయన ఈ పదవిలో కేవలం తొమ్మిది నెలలు మాత్రమే కొనసాగనున్నారు.  
	 
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
