వెండి తెర పండుగ | 'International Film Festival' | Sakshi
Sakshi News home page

వెండి తెర పండుగ

Nov 20 2014 2:21 AM | Updated on Sep 2 2017 4:45 PM

వెండి తెర పండుగ

వెండి తెర పండుగ

రాష్ట్రంలోని సినీ అభిమానులు, కళాకారులు ఉత్సాహంగా ఎదురు చూసే ‘బెంగళూరు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు’

4 నుంచి బెంగళూరులో ‘అంతర్జాతీయ  చలన చిత్రోత్సవాలు’
చిత్రోత్సవాల్లో మొత్తం 45 దేశాలకు చెందిన 164 సినిమాలు
 మొత్తం ఆరు ప్రాంతాల్లో చిత్రాల వీక్షణకు ఏర్పాట్లు
‘మాయాబజార్’కు టెక్ట్స్ ఫర్ మాస్టర్ క్లాసెస్‌లో స్థానం

 
బెంగళూరు : రాష్ట్రంలోని సినీ అభిమానులు, కళాకారులు ఉత్సాహంగా ఎదురు చూసే ‘బెంగళూరు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు’ (బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్) డిసెంబర్ 4 నుంచి 11 వరకు నగరంలో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కన్నడ, సాంస్కృతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శాలినీ రజనీష్ తెలిపారు.  బుధవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలను వెల్లడించారు. 7వ బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలను అంబేద్కర్ భవన్‌లో ప్రారంభిస్తామని, డిసెంబర్ 5 నుంచి చలనచిత్రాల ప్రదర్శన ప్రారంభం అవుతుందని తెలిపారు. ఇక ఈ ఏడాది చలనచిత్రోత్సవాల్లో భారత్‌తో పాటు మొత్తం 45 దేశాలకు చెందిన 164  చలన చిత్రాలను ప్రదర్శిస్తున్నట్లు  పేర్కొన్నారు. భారతదేశానికి చెందిన  49 చలన చిత్రాలను ప్రదర్శిస్తున్నట్లు వివరించారు.

ఇక నగరంలోని ఆరు ప్రాంతాల్లో మొత్తం 11 స్క్రీన్‌లలో ఈ చలనచిత్రాలను ప్రదర్శిస్తామని  తెలిపారు. ఇక ఈ ఏడాది ఏషియన్ సినిమా, ఇండియన్ సినిమా, కన్నడ సినిమా అనే మూడు విభాగాల్లో చలనచిత్రాల పోటీలను సైతం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాక జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, ప్రముఖ రచయిత డాక్టర్ యుఆర్ అనంతమూర్తికి నివాళులు అర్పిస్తూ స్పెషల్ ట్రిబ్యూట్ విభాగంలో ఐదు చిత్రాలను ప్రదర్శిస్తామని   పేర్కొన్నారు. ఈ ఏడాది డెలిగేట్ పాస్‌ల రుసుమును రూ.600, విద్యార్థులు, సినిమా రంగ నిపుణులు, వృద్ధులకు రూ.300 రుసుముగా నిర్ణయించినట్లు చెప్పారు. డెలిగేట్ పాస్‌లను పొందేందుకు గాను ఠీఠీఠీ.ఛజీజజ్ఛట.జీ వెబ్‌సైట్‌లో లాగిన్ అయి తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని సూచించారు. ఇక ఈ ఏడాది డెలిగేట్ పాస్‌లను 5వేలకు మాత్రమే పరిమితం చేయనున్నామని పేర్కొన్నారు.

టెక్ట్స్ ఫర్ మాస్టర్ క్లాసెస్‌లో ‘మాయాబజార్’....

ఇక ఈ ఏడాది జరగనున్న 7వ బెంగళూరు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో తెలుగు చలనచిత్ర సీమలో ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌గా నిలిచిన మాయాబజార్ చిత్రం ప్రదర్శితం కానుంది. అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలోని టెక్ట్స్ ఫర్ మాస్టర్ క్లాసెస్ విభాగంలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఎన్‌టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు, సావిత్రి తదితర దిగ్గజ నటులు నటించిన ఈ సినిమాకు కాద్రి వెంకట రెడ్డి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement