కోర్టు ఎదుట హోంగార్డు ఆత‍్మహత్యాయత‍్నం | homeguard suicide attempt at civil court in mancherial district | Sakshi
Sakshi News home page

కోర్టు ఎదుట హోంగార్డు ఆత‍్మహత్యాయత‍్నం

May 9 2017 12:16 PM | Updated on Sep 2 2018 3:08 PM

బెల‍్లంపల్లిలోని సివిల్‌ కోర్టు ముఖద్వారం ఎదుట హోంగార్డు నారాయణ ఆత‍్మహత్యాయత‍్నం చేశాడు.

బెల‍్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల‍్లంపల్లిలోని సివిల్‌ కోర్టు ముఖద్వారం ఎదుట హోంగార్డు నారాయణ మంగళవారం ఉదయం ఆత‍్మహత్యాయత‍్నం చేశాడు. ఏడు సంవత‍్సరాలుగా హోంగార్డులకు పోస్టింగ్‌ ఇవ‍్వలేదని, విధుల‍్లోకి తీసుకోకుండా పోలీసు విభాగం అన్యాయం చేస్తోందని ఆవేదన వ‍్యక‍్తం చేస్తూ తెలంగాణ హోంగార్డుల సంఘం అధ‍్యక్షుడు నారాయణ మంగళవారం ఆత‍్మహత్యాయత‍్నం చేశాడు. సివిల్‌ కోర్టు ప్రారంభమైన కాసేపటికి ముఖద‍్వారం వద‍్దకు వెళ్ళిన ఆయన కత్తితో చేతిని కోసుకున్నాడు.
 
గమనించిన స్థానికులు కేకలు వేయడంతో పోలీసులు రంగప్రవేశం చేసి అతడిని వారించి బలవంతంగా ఆస‍్పత్రికి తరలించారు. టూ టౌన్‌ ఎస్‌ఐ స్వామి, వన్‌ టౌన్‌ ఎస్‌ఐ గౌడ్‌ హుటాహుటిన కోర్టువద‍్దకు చేరుకుని హోంగార్డు నారాయణకు నచ‍్చజెప్పారు. ఉన‍్నతాధికారులకు ఎన‍్నిసార్లు విన‍్నవించుకున‍్నా తమకు న్యాయం చేయలేదని, ఆత‍్మహత‍్య తప‍్ప తమకు శరణ‍్యంలేదని ఆయన పేర‍్కొన్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement