
నటి విజయశాంతికి హైకోర్టు నోటీసులు
సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతికి ఆస్తుల విక్రయం కేసులో మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
దీంతో విజయశాంతిపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా స్థానిక జార్జ్ టౌన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దాన్ని ఆ కోర్టు కొట్టివేసింది. దీంతో ఇందర్‌చంద్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌ను శనివారం విచారణకు స్వీకరించారు. ఈ వివాదాన్ని సామరస్యంగా చర్చించి పరిష్కరించుకోవాలని ఆదేశిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేశారు. ఆ రోజు విజయశాంతి స్వయంగా హాజరు కావాలని ఉత్తర్వులు జారీచేశారు.