ఉద్దండరాయునిపాలెంలో ఉద్రిక్తత! | Hi-tension during Farmers, wagers meeting at Uddandarayunipalem | Sakshi
Sakshi News home page

ఉద్దండరాయునిపాలెంలో ఉద్రిక్తత!

Sep 22 2016 7:17 PM | Updated on Oct 1 2018 2:00 PM

ఉద్దండరాయునిపాలెంలో ఉద్రిక్తత! - Sakshi

ఉద్దండరాయునిపాలెంలో ఉద్రిక్తత!

ఉద్దండరాయునిపాలెంలో రైతులు, రైతు కూలీలు తలపెట్టిన సమావేశం ఉద్రిక్తతకు దారితీసింది.

అమరావతి: రాజధాని భూములకు అందుతున్న పరిహారం విషయంలో చర్చించుకునేందుకు రైతులు, రైతు కూలీలు గురువారం తలపెట్టిన సమావేశం ఉద్రిక్తతకు దారితీసింది. ఉద్దండరాయునిపాలెంలో ఈ రోజు సాయంత్రం స్థానిక రైతులు భూ పరిహారానికి సంబధించిన అంశాలపై చర్చింకునేందుకు రైతు కూలీలతో కలిసి సమావేశం ఏర్పాటు చేయాలని అనుకున్నారు.

విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని 144 వ సెక్షన్ అమలులో ఉందని ఎలాంటి సభలు సమావేశాలు ఏర్పాటు చేయకూడదని హెచ్చరించారు. దీనిని రైతులు లెక్క చేయకుండా ఒక్కచోట చేరి చర్చించుకునేందుకు యత్నించడంతో పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
 

Advertisement
 
Advertisement
Advertisement