శ్రీకాకుళం జిల్లా కవిటి వద్ద బొలెరో వాహనంలో రవాణా చేస్తున్న సుమారు 650 కిలోల గంజాయిని తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
650 కిలోల గంజాయి స్వాధీనం
Dec 17 2016 11:31 AM | Updated on Sep 2 2018 4:52 PM
కవిటి: శ్రీకాకుళం జిల్లా కవిటి వద్ద బొలెరో వాహనంలో రవాణా చేస్తున్న సుమారు 650 కిలోల గంజాయిని తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో 16వ నెంబరు జాతీయ రహదారిపై నిఘా పెట్టి వాహనాన్ని ఆపిన పోలీసులు తనిఖీ చేశారు. చేపలను నిల్వ చేసే పెట్టెల్లో రవాణా చేస్తున్న గంజాయిని కనుగొన్నారు. కారులోని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇచ్ఛాపురం రూరల్ ఎస్సై, సోంపేట ఎస్సైల ఆధ్వర్యంలో సిబ్బంది గంజాయిని పట్టుకున్నారు.
Advertisement
Advertisement