12 నుంచి మెజిస్టిక్ నుంచి...ఏపీ బస్సుల రాకపోకలు | from 12 th buses from the AP to Majestic | Sakshi
Sakshi News home page

12 నుంచి మెజిస్టిక్ నుంచి...ఏపీ బస్సుల రాకపోకలు

Oct 7 2014 2:15 AM | Updated on Sep 4 2018 5:15 PM

బెంగళూరులోని శాంతి నగర (డబుల్ రోడ్డు) బస్సు స్టేషన్ నుంచి బయలుదేరే ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు ఈ నెల 12 నుంచి గతంలో మాదిరే యథావిధిగా మెజిస్టిక్ నుంచి రాకపోకలు సాగిస్తాయని ..

సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బెంగళూరులోని శాంతి నగర (డబుల్ రోడ్డు) బస్సు స్టేషన్ నుంచి బయలుదేరే ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు ఈ నెల 12 నుంచి గతంలో మాదిరే యథావిధిగా మెజిస్టిక్ నుంచి రాకపోకలు సాగిస్తాయని ఆ సంస్థ స్థానిక అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ రవీంద్రనాథ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

హైదరాబాద్, కర్నూలు, మంత్రాలయం, నందికొట్కూరు, నంద్యాల, కోయిలకుంట్ల, మార్కాపురం (వయా అనంతపురం)ల వైపు వెళ్లే వోల్వో, సూపర్ లగ్జరీలన్నీ కెంపేగౌడ బస్సు స్టేషన్ (మెజిస్టిక్)లోని టెర్మినల్-1, ప్లాట్‌ఫాం నం-19 నుంచి (పాత సంగం టాకీసు ఎదురుగా) బయలుదేరుతాయని వివరించారు. నెల్లూరు, విజయవాడ, గుడివాడ, నూజివీడు, మచిలీపట్నం, ఒంగోలు, గుంటూరు, తెనాలి, కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి వైపు వెళ్లే వోల్వో, సూపర్ లగ్జరీ బస్సులు కెంపేగౌడ బస్సు స్టేషన్ టెర్మినల్-1, ప్లాట్‌ఫాం నం-4 నుంచి బయలుదేరుతాయని ఆయన  వెల్లడించారు. మెట్రో రైలు నిర్మాణ పనుల కోసం సుమారు మూడేళ్ల కిందట ఏపీఎస్‌ఆర్టీసీకి చెందిన వోల్వో, సూపర్ లగ్జరీ బస్సులను శాంతి నగర బస్సు స్టేషన్‌కు తరలించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement