చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం రాయలచెరువుపేట గ్రామంలో శనివారం ఉదయం జరిగిన జన‍్మభూమి సభ రసాభాసగా మారింది.
జన‍్మభూమిలో రచ‍్చరచ‍్చ
Jan 7 2017 12:17 PM | Updated on Jun 4 2019 5:16 PM
రామచంద్రాపురం: చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం రాయలచెరువుపేట గ్రామంలో శనివారం ఉదయం జరిగిన జన‍్మభూమి సభ రసాభాసగా మారింది. రిజర్వుఫారెస్టుకు సమీపంలో ఉన‍్న తమ పొలాలపై అడవిపందులు పడి పంటలను నాశనం చేస‍్తున్నాయని, తమకు నష‍్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాయలచెరువుపేట గ్రామానికి చెందిన దాదాపు 80 మంది రైతులు అధికారులను నిలదీశారు.
జన‍్మభూమి సభను అడ్డుకున్నారు. ఏంపీడీవో, తహశీల్దార్ తదితర అధికారులు పాల‍్గొన‍్న ఈ సభ ప్రారంభమైన వెంటనే రైతులందరూ ఒక‍్కసారిగా వేదికను ముట‍్టడించి అధికారులను నిలదీశారు. విషయాన్ని అటవీ అధికారుల దృష్టికి తీసుకువెళతామని, భూముల చుట్టూ ఫెన్సింగ్ వేసేందుకు కృషిచేస్తామని అధికారులు చెప్పినా రైతులు శాంచింతలేదు. తాము నష‍్టపోయిన వేరుశెనగ, మొక‍్కజొన‍్న, వరి పంటలకు నష‍్టపరిహారం ఎవరు చెల్లిస్తారని వారు నిలదీశారు. దాంతో సభ రాసాభాసగా మారింది.
Advertisement
Advertisement