విద్యార్థిని ఆత్మహత్య | BE first year student commits suicide | Sakshi
Sakshi News home page

విద్యార్థిని ఆత్మహత్య

Sep 25 2014 12:14 AM | Updated on Nov 9 2018 4:36 PM

విద్యార్థిని ఆత్మహత్య - Sakshi

విద్యార్థిని ఆత్మహత్య

ధర్మపురి జిల్లా పాపిరెడ్డి పట్టికి చెందిన మురుగన్. ఆయన కుమార్తె సౌందర్య (18) నామక్కల్‌లో ఉన్న కింగ్ ఇంజినీరింగ్ కళాశాలలో బీఈ మొదటి సంవత్సరం చదువుతుంది.

సేలం:ధర్మపురి జిల్లా పాపిరెడ్డి పట్టికి చెందిన మురుగన్. ఆయన కుమార్తె సౌందర్య (18) నామక్కల్‌లో ఉన్న కింగ్ ఇంజినీరింగ్ కళాశాలలో బీఈ మొదటి సంవత్సరం చదువుతుంది. ఆమెతో పాటు హాస్టల్ గదిలో ఐదుగురు బస చేస్తున్నారు. సౌందర్య బుధవారం ఉదయం హాస్టల్ గది నుంచి కళాశాలకు స్నేహితులతో బయలుదేరింది. మార్గమధ్యంలో తను గదికి వెళ్లిపోతానని తెలిపి వెను తిరిగి హాస్టల్ గదికి వెళ్లింది. కొంతసేపటికి మరొక విద్యార్థిని గదిలో మరిచిపోయిన నోట్ బుక్‌ను తీసుకునేందుకు వెళ్లగా అక్కడ గదిలో సౌందర్య ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతి చెంది ఉండడాన్ని చూసి దిగ్భ్రాంతి చెందింది. సమాచారం అందుకున్న నామక్కల్ ఎస్పీ సెంథిల్ కుమార్ సంఘటన స్థలానికి వచ్చి గదిలో సోదా చేశారు. ఆ సమయంలో టేబుల్‌పై సౌందర్య రాసిన ఒక లేఖ లభించింది. అందులో తల్లిదండ్రులు బలవంతంగా చదివిస్తున్నారని, అందువల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రాసి ఉంది. అనంతరం ఆమె మృతదేహాన్ని పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం నామక్కల్ జీహెచ్‌కు తరలించారు. నామక్కల్ పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement