ప్రముఖ దర్శకుడి విగ్రహావిష్కరణ | Balachander status opens at thiruvaarur | Sakshi
Sakshi News home page

ప్రముఖ దర్శకుడి విగ్రహావిష్కరణ

Jul 10 2017 7:15 AM | Updated on Sep 5 2017 3:42 PM

ప్రముఖ దర్శకుడి విగ్రహావిష్కరణ

ప్రముఖ దర్శకుడి విగ్రహావిష్కరణ

ప్రఖ్యాత సినీ దర్శక దిగ్గజం కే.బాలచందర్‌కు శిలా విగ్రహాన్ని ఆయన సొంత ఊరు అయిన తిరువారూర్‌ జిల్లాలోని నలమాంగుడిలో నెలకొల్పారు.

చెన్నై:
ప్రఖ్యాత సినీ దర్శక దిగ్గజం కే.బాలచందర్‌కు శిలా విగ్రహాన్ని ఆయన సొంత ఊరు అయిన తిరువారూర్‌ జిల్లాలోని నలమాంగుడిలో నెలకొల్పారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఆదివారం సాయంత్రం జరిగింది. ప్రముఖ గీతరచయిత వైరముత్తు ఆయన మిత్రబృందం నిర్వహంచిన ఈ కార్యక్రమంలో దర్శకుడు మణిరత్నం, వసంత్‌ తదితర సినీ ప్రముఖులతో పాటు కె.బాలచందర్‌ సతీమణి రాజ్యం,  కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గీతర చయిత వైరముత్తు మాట్లాడుతూ సినీదిగ్గజం కె.బాలచందర్‌ స్టార్స్‌  అంతస్తును మించిన ఖ్యాతిని గడించారని కీర్తీంచారు. ఆయన జీవితాన్ని యువత పాఠంగా తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement