జీవితాన్నిచ్చిన నటుడు అజిత్ | Ajith gave me a life, says AR Murugadoss | Sakshi
Sakshi News home page

జీవితాన్నిచ్చిన నటుడు అజిత్

Oct 28 2014 1:08 AM | Updated on Sep 2 2017 3:28 PM

జీవితాన్నిచ్చిన నటుడు అజిత్

జీవితాన్నిచ్చిన నటుడు అజిత్

అజిత్‌కు చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంత పేరు ఉందో వ్యక్తిగతంగాను అంతే మంచి పేరుంది. ఇతరులకు సహాయం చేసే గుణం ఆయనకు ఆది నుంచి అలవడిందని పేర్కొనవచ్చు.

అజిత్‌కు చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంత పేరు ఉందో వ్యక్తిగతంగాను అంతే మంచి పేరుంది. ఇతరులకు సహాయం చేసే గుణం ఆయనకు ఆది నుంచి అలవడిందని పేర్కొనవచ్చు. నేటి ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కూడా తనకు జీవితాన్నిచ్చిన నటుడు అజిత్‌నేనంటారు. ఈయన తొలి చిత్రం హీరో అజిత్‌తోనే చేశారు. వీరి కలయికలో వచ్చిన దిన చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఏఆర్ మురుగదాస్ విజయ్ హీరోగా తెరకెక్కించిన తాజా చిత్రం కత్తి ఇటీవల విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
 
 దీంతో తదుపరి ఈ దర్శకుడి చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయన్న విషయాన్ని  ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి మురుగదాస్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ తాను సహాయ దర్శకుడిగా కష్టాలను అనుభవిస్తున్నప్పుడు దర్శకుడిగా అవకాశం కల్పించి జీవితాన్ని ప్రసాదించిన నటుడు అజిత్ అని వెల్లడించారు. అంతేకాదు అలాంటి నటుడితో ఎప్పుడైనా చిత్రం చెయ్యడానికి సిద్ధమని, కథ కూడ తయారుగా ఉందన్నారు. దీంతో వీరి కలయిలో ఒక భారీ చిత్రం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ తన తదుపరి చిత్రాన్ని హిందీలో తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నారు. లేడీ ఓరియంటెడ్ కథా చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా నాయకిగా నటించనున్నారు. ఈ చిత్రం డిసెంబర్‌లో సెట్‌పైకి వెళ్లనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement