మాజీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీ | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీ

Published Tue, Jun 6 2017 6:42 AM

మాజీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీ

అన్నానగర్‌: అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే ఇంటి తాళాలు పగులగొట్టి 42 సవర్ల నగలు రూ. 22 వేల నగదు చోరీ చేసి పరారైన దుండగుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నా రు. ఈ ఘటన సెమ్‌బణార్‌కోవిల్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. నాగై జిల్లా, మైలాడుదురై సమీపంలో ఉన్న సెమ్‌బణార్‌కోవిల్‌ నల్లాడై రోడ్డు ప్రాంతానికి చెందిన వ్యక్తి రంగనాథన్‌ (65). పూమ్‌పుహార్‌లో మాజీ  ఎమ్మెల్యే అయిన ఇతను అన్నాడీఎంకేకు చెందినవాడు. గత రెండు రోజులకు ముందు రంగనాథన్, ఇంటికి తాళం వేసి భార్యతో చెన్నైకి వెళ్లి తన మనవడి పుట్టిన రోజు వేడుకలో కలుసుకొన్నారు. చెన్నై నుంచి తిరిగి ఆదివారం రోజు ఇంటికి వచ్చారు.

అప్పుడు ఇంటి తాళాలు తెరచి ఉండడాన్ని చూసి దిగ్భ్రాంతి చెందారు. అనంతరం లోపలకు వెళ్లి చూడగా బీరువా పగులగొట్టి, అందులో ఉన్న 42 సవర్ల నగలు, రూ. 22 వేల నగదును దుండుగుల చోరి చేసి పరారైనట్లు తెలిసింది. దీనిపై సమాచారం అందుకొన్న మైలాడుదురై జయంట్‌ పోలీసు కమిషనర్‌ కలిదియర్తన్, సెంగునార్‌కోవిల్‌ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ కు లోత్తుంగన్, పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేశారు. అనంతరం పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి నగలు, నగదు చోరీ చేసి పరారైన దుండుగుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో చోరి జరిగిన సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

Advertisement
 
Advertisement
 
Advertisement