
అహల్య పాత్రలో రాధికా ఆప్తే
నటి రాధికా ఆప్తే ఈ మధ్య తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. సమీప కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమపై విమర్శలు గుప్పించి
నటి రాధికా ఆప్తే ఈ మధ్య తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. సమీప కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమపై విమర్శలు గుప్పించి ఆ పరిశ్రమ ఆగ్రహానికి గురైన ఈ అమ్మడి బాత్రూమ్ దృశ్యాలు ఇటీవల ఇంటర్‌నెట్‌లో హల్‌చల్ చేయడం ద్వారా కలకలం పుట్టించాయి. ప్రస్తుతం సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజా చిత్రంలో హీరోయిన్ ఈ గడసరినేననే ప్రచారం జరుగుతోంది. ఇలా తరచూ వార్తల్లో ఎక్కుతున్న రాధికా ఆప్తే ఇప్పుడు హిందీలో కహాని దర్శకుడు సుజయ్ ఘోష్ తాజా చిత్రంలో నటిస్తోంది. ఇది రామాయణ కథను సోషలైజ్ చేసి రూపొంది స్తున్న చిత్రం అని సమాచారం. ఇందులో రాధికా ఆప్తే, గౌతమ్ మహర్షి పత్ని అహల్య పాత్రలో నటిస్తున్నారట.
యుక్త వయసులో ఉన్న అహల్యను ఇంద్రలోకాధిపతి దేవేంద్రుడు మోహించడం, ఆమెను పొందాలని ప్రయత్నించడం అది గ్రహించిన గౌతమ్ మహర్సి అహల్యను శపించడం వంటి సన్నివేశాలను సోషలైజ్ చేసి చిత్రీకరించడంతో అహల్య పాత్రలో నటి రాధిక ఆప్తే అందాలను విచ్చలవిడిగా ఆరబోస్తున్నారట. ఆ సన్నివేశాలను దర్శకుడు ఇటీవల యూ ట్యూబ్‌లో విడుదల చేసి పెద్ద వివాదానికి తెర లేపారు. కమర్షియల్ టచ్‌తో శృంగార భరితంగా నటించిన రాధికాఆప్తే విమ అందరి విమర్శలను ఎదుర్కొంటున్నారు. చిత్రం విడుదల తరువాత ఈ భామ మరెన్ని విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందో వేచి చూడాల్సిందే.