
చెన్నై, టీ.నగర్: ఆషాడం నెలలో వరుసగా వచ్చే మారియమ్మన్ ఆలయాల ఉత్సవాలతో సేలంలో చిల్లి చికెన్‌కు ఆడి ఆఫర్ ప్రకటించారు. ఆషాడం మాసం ప్రారంభం కావడంతో అమ్మవారి ఆలయాలలో భక్తులు వ్రతం ఉంటున్నారు. దీంతో చికెన్, మటన్ విక్రయాలు తగ్గి రేట్లు కూడా భారీగా రేట్లు తగ్గాయి. సేలంలోని మారియమ్మన్ ఆలయాల్లో 23వ తేదీ నుంచి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దీంతో చిల్లీ చికెన్ విక్రయాల్లో పతనాన్ని తగ్గించుకునేందుకు వ్యాపారుల ఆషాడం ప్రత్యేక ఆఫర్ ప్రకటించారు. దీనిగురించి వ్యాపారులు మాట్లాడుతూ ప్రత్యేక ఆఫర్ ద్వారా చిల్లి చికెన్ విక్రయాలు ఎప్పటిలా సాగుతున్నట్లు వివరించారు.