మూడేళ్ల చిన్నారిపై బాలుడి లైంగిక దాడి | 3-year-old sexually assaulted in Bengaluru | Sakshi
Sakshi News home page

మూడేళ్ల చిన్నారిపై బాలుడి లైంగిక దాడి

Jul 24 2016 11:09 AM | Updated on Jul 23 2018 8:49 PM

మూడేళ్ల చిన్నారిపై బాలుడి లైంగిక దాడి - Sakshi

మూడేళ్ల చిన్నారిపై బాలుడి లైంగిక దాడి

మూడేళ్ల చిన్నారిపై బాలుడు లైంగికదాడికి పాల్పడిన ఘటన తలఘట్టపుర పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది.

బెంగళూరు(బనశంకరి): మూడేళ్ల చిన్నారిపై బాలుడు లైంగికదాడికి పాల్పడిన ఘటన తలఘట్టపుర పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది.  తలఘట్టపురలో నివాసం ఉంటున్న 13ఏళ్ల బాలుడు ఆడుకునే నెపంతో ఆ గ్రామానికి చెందిన ఓ బాలికను ఇంటికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. గంట తరువాత తీవ్రమైన కడుపు నొప్పితో ఇంటికి చేరుకున్న బాలిక ఘటన గురించి తల్లికి తెలియజేసింది.

ఆస్పత్రికి తీసుకెళ్లగా లైంగికదాడి జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకొని పోక్సోచట్టం కింద కేసు నమోదు చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.అనంతరం బాలమందిరానికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement