విద‍్యుదాఘాతంతో ఇద‍్దరి మృతి | 2 died in current shock at karimnagar district | Sakshi
Sakshi News home page

విద‍్యుదాఘాతంతో ఇద‍్దరి మృతి

Published Mon, Mar 6 2017 12:08 PM | Last Updated on Tue, Sep 5 2017 5:21 AM

రీంనగర్‌ జిల్లా గొల‍్లపల్లి మండలంలో రెండు వేర‍్వేరు సంఘటనల‍్లో విద్యుదాఘాతంతో ఇద‍్దరు వ‍్యక్తులు మృతి చెందారు.

గొల‍్లపల్లి : కరీంనగర్‌ జిల్లా గొల‍్లపల్లి మండలంలో రెండు వేర‍్వేరు సంఘటనల‍్లో విద్యుదాఘాతంతో ఇద‍్దరు వ‍్యక్తులు మృతి చెందారు. గొల‍్లపల్లి మండలం బొంకూరు గ్రామంలో వ‍్యవసాయ బావికి సంబంధించిన మోటారు మరమ‍్మతు చేస్తుండగా పి.సత్తెయ‍్య అనే వ‍్యక్తి సోమవారం ఉదయం కరెంట్‌ షాక్‌తో మృతి చెందాడు. మోటారు మరమ‍్మతుకు సత్తెయ‍్య బావిలోకి దిగగా గట్టు పైన ఉన‍్న తిరుపతిరావు అనే వ‍్యక్తి పొరపాటున మోటారు స్విచ్‌ ఆన్‌ చేయడంతో విద్యుదాఘాతంతో సత్తెయ‍్య బావిలోనే మృతి చెందాడు.
 
ఇలా ఉండగా గొల‍్లపల్లి మండలం తిరుమలాపూర్‌లో మరో సంఘటన జరిగింది. మరదలు పెళ్ళికి పందిరివేసి సీరియల్‌ లైట్లు వెలిగిస్తుండగా కరెంట్‌ షాక్‌ కొట్టి తిరుపతి అనే వ‍్యక్తి ఆదివారం అర‍్థరాత్రి మృతి చెందాడు. మల్యాల మండలం మ్యాడంపల్లికి చెందిన తిరుపతి మరదలు పెళ్ళికని తిరుమలాపూర్‌ వెళ్ళాడు. ఆదివారం రాత్రి సిరియల్‌ లైట్లు వెలిగిస్తుండగా కరెంట్‌ షాక్‌ కొట్టింది. దాంతో పెళ్ళి మండపంలోనే కుప‍్పకూలి మృతిచెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement