ఈతకు వెళ్లి గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలను శనివారం ఉదయం బయటకు తీశారు.
ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థుల మృతి
Apr 22 2017 11:53 AM | Updated on Nov 9 2018 4:12 PM
అమీన్‌పూర్: ఈతకు వెళ్లి గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలను శనివారం ఉదయం బయటకు తీశారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండల చెరువులో శుక్రవారం సాయంత్రం ఈతకని వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వారి కోసం రాత్రి నుంచి గాలింపు చర్యలు చేపట్టగా శనివారం మృతదేహాలు లభ్యమయ్యాయి. మియాపూర్‌లోని స్టాలిన్ నగర్‌కు చెందిన రాజు(15) పదో తరగతి పరీక్షలు పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటున్నాడు.
తరుణ్(16) ఇటీవలే ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తి చేశాడు. ఇద్దరు స్నేహితుల కలిసి ఈత కొట్టేందుకు శుక్రవారం సాయంత్రం వెళ్లారు. ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో.. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వారి కోసం వెతకగా.. చెరువు గట్టుపై దుస్తులు కనిపించాయి. దీంతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టినా లాభం లేకపోయింది. శనివారం ఉదయం మత్స్యకారుల సాయంతో మృతదేహాలను బయటకు తీశారు.
Advertisement
Advertisement