హెల్మెట్‌ ధరించకుంటే రూ.1000 జరిమానా

1000 Challan on Without Helmet Punishment - Sakshi

అమల్లోకి చట్ట సవరణ

తమిళనాడు, టీ.నగర్‌: హెల్మెట్‌ ధరించకుంటే రూ.1,000 అపరాధం విధించే చట్ట సవరణ గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. హెల్మెట్‌ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపినట్లయితే రూ.వెయ్యి అపరాధం విధించబడుతుందని ఇటీవల ట్రాఫిక్‌ పోలీసు శాఖ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. మోటార్‌ వాహన చట్టంలో కేంద్ర ప్రభుత్వం సవరణ జరిపి దాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టింది. దీని ప్రకారం హెల్మెట్‌ లేకుండా వాహనం నడిపితే రూ.1,00 నుంచి రూ.1,000కి పెంచారు. వెనుక కూర్చున్నవారు హెల్మెట్‌ ధరించనట్లయితే ఖచ్చితంగా అపరాధం వసూలు చేయబడుతుందని నగర ట్రాఫిక్‌ పోలీసులు ప్రకటనలో తెలిపారు. చెన్నై నగర పోలీసు సర్కిల్‌ ప్రాంతంలో ట్రాఫిక్‌ అడిషనల్‌ కమిషనర్‌ అరుణ్‌ ఉత్తర్వుల మేరకు గురువారం నుంచి హెల్మెట్‌ ధరించకుండా బైక్‌ నడిపినవారికి రూ.1,000 అపరాధం విధించారు. అలాగే వెనుక కూర్చున్న వారి వద్ద అపరాధాన్ని వసూలు చేశారు. ముఖ్యంగా చెన్నై కామరాజర్‌ రోడ్డు, ఈస్ట్‌కోస్ట్‌ రోడ్డు, ఓఎంఆర్‌ రోడ్డు, మౌంట్‌రోడ్డు, పూందమల్లి హైరోడ్డు సహా నగరవ్యాప్తంగా 100కు పైగా ప్రాంతాలలో ట్రాఫిక్‌ పోలీసులు ఆకస్మిక తనిఖీలు జరిపి అపరాధ సొమ్మును వసూలు చేశారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top