ధోని కూతురు.. సోషల్‌ మీడియా సెలబ్రిటీ | Ziva Dhoni Sings Another Malayalam Song | Sakshi
Sakshi News home page

ధోని కూతురు.. సోషల్‌ మీడియా సెలబ్రిటీ

Dec 3 2017 8:34 AM | Updated on Dec 3 2017 11:00 AM

Ziva Dhoni Sings Another Malayalam Song - Sakshi

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని గారాల పట్టి నెట్టింట్లో సందడి చేస్తోంది. మూడేళ్ల ధోని కుమార్తె... జివా ధోని ఇప్పటికే సోషల్‌ మీడియాలో తనకంటూ ప్రత్యేక స్టార్‌డమ్‌ తెచ్చుకుంది. జివాకు సంబంధించిన పలు వీడియోలు ఇప్పటికే సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. తాజాగా ఈ చిన్నారి.. ఒక మలమాళం పాటను పాడుతుండగా తీసిన వీడియో ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌ అవుతోంది.

తాజాగా జివా ధోని ‘ఒకన్‌కుట్టం’ మలయాళ సూపర్‌ హిట్‌ చిత్రంలోని ‘కనికుణ్‌ నేరమ్‌ కమలంతెరంటే’ అనే పాటను జివా ధోని ముద్దుముద్దగా ఆలపిస్తోంది. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ అయిన ఈ వీడియోను ఇప్పటివరకూ లక్ష 60 వేలమందికి పైగానే వీక్షించారు.

చిన్నారి జివా ధోనిసింగ్‌ పేరుతో ధోని దంపతులు ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్‌ తెరిచారు. ఈ అకౌంట్‌నుంచే జివాకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను ధోని దంపతులు అభిమానులతో పంచుకుంటున్నారు.

#unwell n yet singing away #winterishere

A post shared by ZIVA SINGH DHONI (@zivasinghdhoni006) on

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement