సీసీఓబీపై వైఎంసీఏ గెలుపు | ymca wins over ccob in basket ball tourny | Sakshi
Sakshi News home page

సీసీఓబీపై వైఎంసీఏ గెలుపు

Aug 11 2016 12:04 PM | Updated on Sep 4 2017 8:52 AM

క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో గ్రూప్ ‘ఇ’ విభాగంలో హైదరాబాద్ వైఎంసీఏ జట్టు అగ్రస్థానంలో నిలిచింది.

సాక్షి, హైదారాబాద్: క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో గ్రూప్ ‘ఇ’ విభాగంలో హైదరాబాద్ వైఎంసీఏ జట్టు అగ్రస్థానంలో నిలిచింది. హైదరాబాద్ జిల్లా బాస్కెట్‌బాల్  సంఘం నిర్వహిస్తున్న ఈ టోర్నీలో బుధవారం ఆసక్తి రేకెత్తించిన మ్యాచ్‌లో వైఎంసీఏ జట్టు 49-40తో సీసీఓబీ జట్టును ఓడించింది.

 

ఈ మ్యాచ్‌లో వైఎంసీఏ తరఫున లలిత్ రెడ్డి 20 పాయింట్లు, వినయ్ 10 పాయింట్లు చేయగా... సీసీఓబీ జట్టులో ఫణి 12, నాగరాజ్ 10 పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ ‘ఎ’ 42-27తో ఎన్‌బీఏ ‘బి’ జట్టుపై గెలిచింది. బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ తరఫున ప్రదీప్ సింగ్ (16), విపిన్ (15) అద్భుతంగా రాణించగా... ఎన్‌బీఏ జట్టులో శేరు (15) ప్రతిభ కనబరిచాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement