టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌ | westindies opts fielding in second T20 | Sakshi
Sakshi News home page

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌

Nov 6 2018 6:47 PM | Updated on Nov 6 2018 6:51 PM

westindies opts fielding in second T20 - Sakshi

లక్నో:  భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో వెస్టిండీస్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఇప్పటికే ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టీ-20లో భారత్ విజయం సాధించి సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని విండీస్ భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగుతున్నాయి. భారత జట్టులో ఉమేష్ యాదవ్‌కు బదులుగా భువనేశ్వర్ కుమార్ ఆడుతుండగా, వెస్టిండీస్ జట్టులో నికోలస్ పూరన్ చేరాడు. 

జట్ల వివరాలు :

వెస్టిండీస్: షై హోప్, దెనెష్ రామ్‌దిన్(కీపర్), షిమ్రన్ హెట్మేర్, కీరన్ పొలార్డ్, డర్రెన్ బ్రావో, నికోలస్ పూరన్, కరోల్స్ బ్రాత్‌వైట్(కెప్టెన్), ఫబైన్ అలెన్, కీమో పాల్, ఖార్రే పిర్రే, ఓషెన్ థామస్.
 
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధవన్, లోకేశ్ రాహుల్, రిషబ్ పంత్, మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్(కీపర్), కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement