‘మూడు వన్డేల తర్వాత పెట్రోల్‌ అయిపోయింది’

We had no petrol left in tank after first three ODIs, Stuart Law - Sakshi

తిరువనంతపురం: భారత్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో తమ జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉందని వెస్టిండీస్‌ కోచ్‌ స్టువర్ట్‌ లా పేర్కొన్నాడు. అండర్‌ డాగ్స్‌గా బరిలోకి దిగిన తమ జట్టు.. బలమైన భారత్‌కు వారి దేశంలోనే గట్టిపోటీ ఇచ్చిందన్నాడు. ఈ విషయం తొలి మూడు వన్డేలను చూస్తే అర్ధమవుతుందన్నాడు. కాగా, తొలి మూడు వన్డేల తర్వాత చివరి రెండు వన్డేల్లో విండీస్‌ ఘోరంగా వైఫల్యం చెందడంపై స్టువర్ట్‌లా చమత్కరించాడు. మూడు వన్డేలకే తమ ఆటగాళ్లలో పెట్రోల్‌ అయిపోయిందని సెటైర్‌ వేశాడు. 

‘మా కుర్రాళ్లు తెలివైన వారు. నైపుణ్యం ఉంది. ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకొనే అనుభవం వారికి రావాలి. నలభైవేల మంది అభిమానులు స్టేడియాన్ని హోరెత్తిస్తుంటే అత్యుత్తమ జట్టుతో తలపడడం అంత సులువు కాదు. ఆ పరిస్థితులను అనుభవిస్తే అలవాటవుతుంది. గెలవాలంటే నైపుణ్యం మాత్రమే సరిపోదు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ముఖ్యం. మూడు వన్డేల తర్వాత మా జట్టు వైఫల్యం చెందడానికి కారణం ఆటగాళ్లలో తగినంత అనుభవం లేకపోవడమే’ అని స్టువర్ట్‌ లా పేర్కొన్నాడు. ఈ సిరీస్‌ను భారత్‌ 3-1 తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. గురువారం జరిగిన చివరిదైన ఐదో వన్డేలో భారత్‌ 9 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకుంది.

ఇక్కడ చదవండి: ముగింపు అదిరింది

ధోని భాయ్‌ అది పక్కా ఔట్‌! 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top