గొడుగేసుకున్న పుతిన్‌, ఆగని సోషల్‌ మీడియా

Vladimir Putins Umbrella Steals The Show At World Cup Final - Sakshi

మాస్కో : తిరుగులేని ప్రదర్శనతో క్రొయేషియాను మట్టికరిపించిన ఫ్రాన్స్‌, ఫిఫా ప్రపంచకప్‌ 2018 విజేతగా నిలిచింది. రసవత్తరంగా సాగిన ఫైనల్లో ప్రపంచకప్‌ తన సొంతం కావడంతో, ఫ్రాన్స్‌లో సంబురాలు అంబరాన్నంటాయి. మాస్కోలో జరిగిన ఈ ప్రపంచకప్‌ తుది సమరంలో ఎన్నో అద్భుతమైన సన్నివేశాలు ప్రపంచ అభిమానులను అలరించాయి. ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యూల్ మాక్రోన్ ఆనందమైతే ఇక పట్టరానిది. స్టేడియంలోనే ఎగిరి గెంతేశారు. ఇక ప్రపంచ కప్‌ ట్రోఫీని విజేతకు ఇచ్చే సంబురంలో, పలువురు దేశాధ్యక్షులు పాల్గొన్నారు. స్టేజీపై ఎంతో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరుగబోతుండగా.. ఒక్కసారిగా ఫ్రెంచ్‌ వేడుకను వర్షం సైతం పలకరించింది. 

ప్రపంచ అధినేతలందరూ వర్షంలోనే తడిసిముద్దవుతూ.. ఈ వేడుకను ఎంజాయ్‌ చేస్తుండగా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మాత్రం చినుకు సైతం తనపై పడకుండా.. గొడుగు వేసుకుని నిల్చున్నారు. ప్రపంచ అధినేతలందరూ తడుస్తూ.. పుతిన్‌ మాత్రమే గొడుగు వేసుకోవడంపై సోషల్‌ మీడియాలో జోకులు పేలుతున్నాయి. పొడియంపై ఫిఫా అధ్యక్షుడు జియాన్నీ ఇన్ఫాంటినో, ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యూల్‌ మాక్రోన్‌, క్రొయేషియా అధ్యక్షుడు కోలిండా గ్రాబార్-కిటరోవిక్ మధ్యలో పుతిన్‌ నిల్చున్నారు. వారందరిన్నీ, ఫిఫా ట్రోఫీని కవర్‌ చేస్తూ.. పుతిన్‌ గొడుగేసుకుని నిల్చోవడంతో, సోషల్‌ మీడియా నవ్వులు పూయిస్తోంది. పుతిన్ గొడుగు దాదాపు ట్రోఫీ వేడుకను కప్పివేసిందని ఒక యూజర్‌ కామెంట్‌ చేయగా.. సర్‌, మనం ఎన్ని గొడుగులు తెచ్చుకున్నామేమిటీ? అని మరో యూజర్‌ వ్యాఖ్యానించాడు. పుతిన్‌పై వస్తున్న జోకులు ఏ విధంగా ఉన్నాయో ఓసారి మీరే చూడండి...
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top