కోహ్లి బ్రాండ్ @రూ.1200కోట్లు

Virat Kohli is Indias most valued celebrity brand - Sakshi

ముంబై: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వరుసగా రెండో ఏడాది దేశంలో ‘మోస్ట్‌ వాల్యుబుల్‌ సెలబ్రిటీ బ్రాండ్‌’గా నిలిచాడు. వివిధ వాణిజ్య సంస్థలకు చేస్తున్న ప్రచారాన్ని లెక్కలోకి తీసుకుంటూ ప్రముఖ గ్లోబల్‌ వాల్యుయేషన్, కార్పొరేట్‌ ఫైనాన్స్‌ సలహాదారు సంస్థ ‘డఫ్‌ అండ్‌ ఫెల్ఫస్‌’ తాజా నివేదిక ఇచ్చింది. దీని ప్రకారం 18 శాతం పెరుగుదలతో 2018లో కోహ్లి బ్రాండ్‌ విలువ ఏకంగా దాదాపు రూ.1,200 కోట్లు (170.9 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లు) అయింది.

దీంతో ఈ జాబితాలో భారత కెప్టెన్‌ అగ్రస్థానం మరింత పదిలమైంది. కోహ్లి గతేడాది నవంబరు వరకు 24 ఉత్పత్తులకు ప్రచారకర్తగా ఉన్నాడు. ఇదే సమయానికి 21 ఉత్పత్తులను ఎండార్స్‌ చేస్తున్న బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పడుకోన్‌  రూ.718 కోట్ల (102.5 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లు) బ్రాండ్‌ విలువతో రెండో స్థానం దక్కించుకుంది. బాలీవుడ్‌ హీరోలు అక్షయ్‌ కుమార్‌ (రూ.473 కోట్లు), రణ్‌వీర్‌ సింగ్‌ (రూ.443 కోట్లు) మూడు, నాలుగో స్థానాల్లో నిలిచారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top