కెప్టెన్ ధోనీ- వైస్ కెప్టెన్ కోహ్లి జోడీ కలిసి ఆడితే ఎలా ఉంటుందో మనకు తెలుసు! ఈ జోడీ ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. భారత జట్టును సెమీస్‌కు చేర్చింది.
కెప్టెన్ ధోనీ- వైస్ కెప్టెన్ కోహ్లి జోడీ కలిసి ఆడితే ఎలా ఉంటుందో మనకు తెలుసు! ఈ జోడీ ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. భారత జట్టును సెమీస్‌కు చేర్చింది. ఇప్పుడు కోహ్లి మాత్రం ధోనీతో కాకుండా బుజ్జీ ధోనీ జివాతో జట్టు కట్టాడు. తన ఫోన్ తీసి ఆ బుజ్జాయి చేతుల్లో పెట్టాడు. మరీ బుజ్జీ ధోనీ ఏం తక్కువ తిన్నదా? తనకు ఫోన్ గురించి ఏ టు జెడ్ తెలిసినట్టు ఏకంగా చెవి దగ్గర మొబైల్ పెట్టుకొని మాట్లాడినట్టు ఫోజు కూడా ఇచ్చింది. ఈ ఆడోరబుల్ సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ధోనీ గారాలపట్టి జివాతో విరాట్ కోహ్లి దిగిన ఈ సెల్ఫీకి 24 గంటల్లోనే ఇన్‌స్టాగ్రామ్‌లో 1.9 లక్షల లైకులు వచ్చాయి. 5వేలకు పైగా కామెంట్స్ వచ్చాయి.
'బుజ్జి జివాను చూడండి అప్పుడు నా ఫోన్‌తో ఆడుకుంటోంది. ఫోన్ ఎలా వాడాలో తెలిసినట్టు. ఎంత క్యూట్‌గా, ఆడోరబుల్‌గా ఉందో కదా. పిల్లలే అంతా. వాళ్లు పక్కన ఉంటే ప్రపంచాన్ని మరిచిపోయి.. వారి అమాయకపు కళ్లలో చూస్తూ ఉండవచ్చు. ఎంత బావుంటుందో' అంటూ జివాతో దిగిన సెల్ఫీని పోస్టు చేశాడు కోహ్లి. మరోవైపు వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ ద్వేన్ బ్రేవో కూడా కూతురిని ఎత్తుకున్న ధోనీ, బౌలర్ భజ్జీతో ఫొటో దిగి ట్విట్టర్‌లో షేర్ చేశాడు.
It was great running into 2 of the greatest #Champions. Captain Kool @msdhoni and @harbhajan_singh.. #ChampionDance pic.twitter.com/fHXgQG5hmD
— Dwayne DJ Bravo (@DJBravo47) 29 March 2016