ఆరు నెలల తర్వాత మళ్లీ రింగ్‌లోకి... | Vijender Singh to fight Lee Markham for third title | Sakshi
Sakshi News home page

ఆరు నెలల తర్వాత మళ్లీ రింగ్‌లోకి...

Jun 7 2018 1:37 AM | Updated on Jun 7 2018 1:37 AM

 Vijender Singh to fight Lee Markham for third title - Sakshi

భారత ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌ స్టార్‌ విజేందర్‌ ఆరు నెలల తర్వాత రింగ్‌లోకి అడుగు పెట్టనున్నాడు. వచ్చే నెల 13న కామన్వెల్త్‌ సూపర్‌ మిడిల్‌ వెయిట్‌ టైటిల్‌ కోసం బ్రిటన్‌ బాక్సర్‌ లీ మార్క్‌హామ్‌తో లండన్‌లో తలపడనున్నాడు. 2015లో ప్రొఫెషనల్‌గా మారిన విజేందర్‌ ఇప్పటివరకు బరిలో దిగిన 10 బౌట్‌లలోనూ విజయం సాధించాడు.

గతేడాది డిసెంబర్‌ 23న జైపూర్‌లో జరిగిన తన చివరి బౌట్‌లో ఘనా బాక్సర్‌ ఎర్నెస్ట్‌ అమూజుపై గెలిచిన విజేందర్‌ తిరిగి బరిలో దిగలేదు. విజేందర్‌ వద్ద ప్రస్తుతం డబ్ల్యూబీఓ ఆసియా పసిఫిక్, ఓరియంటల్‌ టైటిల్స్‌ ఉన్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement