ఆట మధ్యలో ఆసక్తికర ఘటన | vetlana Kuznetsova cuts own hair during WTA final | Sakshi
Sakshi News home page

ఆట మధ్యలో ఆసక్తికర ఘటన

Oct 26 2016 12:56 PM | Updated on Sep 4 2017 6:23 PM

ఆట మధ్యలో ఆసక్తికర ఘటన

ఆట మధ్యలో ఆసక్తికర ఘటన

డబ్ల్యూటీఏ ఫైనల్స్‌ మ్యాచ్‌లో ఈ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.

సింగపూర్‌: క్రీడల్లో రాణించేందుకు క్రీడాకారులు చాలా త్యాగాలు చేస్తుంటారు. ఫిట్ నెస్ కాపాడుకునేందుకు కష్టమైన కసరత్తులతో కుస్తీలు పడుతుంటారు. ఏదిబడితే అది తినకుండా నోరు కట్టేసుకుంటారు. చావోరేవో తేల్చుకునే మ్యాచ్ ఎదురైతే విజయం కోసం ఎంతో శ్రమిస్తారు. సరదాలు, విహారాలు కట్టిపెట్టి ఆటమీదే పూర్తిగా దృష్టి పెడతారు. రష్యా టెన్నిస్ ప్లేయర్ స్వెత్లానా కుజ్‌నెత్సోవా తన జుట్టును త్యాగం చేసింది. తన ఆటకు అడ్డువస్తుందని మ్యాచ్ మధ్యగా ఉండగా, అందరూ చూస్తుండగా తన జుట్టును కత్తిరించుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. డబ్ల్యూటీఏ ఫైనల్స్‌ మ్యాచ్‌లో ఈ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ రద్వాంస్కా తో ఈ మ్యాచ్ లో కుజ్‌నెత్సోవా తలపడింది. మొదటి సెట్ గెలిచిన కుజ్‌నెత్సోవా రెండో సెట్ లో డీలా పడింది. నిర్ణయాత్మక మూడో సెట్ ఆడడానికి ముందు అంపైర్‌ నుంచి పెద్ద కత్తెర అడిగితీసుకుని తన జట్టును కత్తిరించుకుంది. కుజ్‌నెత్సోవా చర్యతో వీక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. జుట్టుపోయినా మ్యాచ్ గెలవడంతో ఆమెకు ఊరట లభించింది. జుట్టు కంటే మ్యాచ్ గెలవడమే ముఖ్యమనుకున్నానని ఆట ముగిసిన తర్వాత కుజ్‌నెత్సోవా చెప్పింది.


అయితే టెన్నిస్ ప్లేయర్లు జట్టు కత్తిరించుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ లో రాఫెల్ నాదెల్ తో జరిగిన మ్యాచ్ లో బ్రిటన్ ఆటగాడు ఆండీ ముర్రే కనుబొమ్మలపై వెంట్రులను కత్తిరించుకున్నాడు. ఒకటిఆరా వెంట్రుకలే కాబట్టి పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement