-
ఆట మధ్యలో ఆసక్తికర ఘటన
-
ఆట మధ్యలో ఆసక్తికర ఘటన
సింగపూర్: క్రీడల్లో రాణించేందుకు క్రీడాకారులు చాలా త్యాగాలు చేస్తుంటారు. ఫిట్ నెస్ కాపాడుకునేందుకు కష్టమైన కసరత్తులతో కుస్తీలు పడుతుంటారు. ఏదిబడితే అది తినకుండా నోరు కట్టేసుకుంటారు. చావోరేవో తేల్చుకునే మ్యాచ్ ఎదురైతే విజయం కోసం ఎంతో శ్రమిస్తారు. సరదాలు, విహారాలు కట్టిపెట్టి ఆటమీదే పూర్తిగా దృష్టి పెడతారు. రష్యా టెన్నిస్ ప్లేయర్ స్వెత్లానా కుజ్నెత్సోవా తన జుట్టును త్యాగం చేసింది. తన ఆటకు అడ్డువస్తుందని మ్యాచ్ మధ్యగా ఉండగా, అందరూ చూస్తుండగా తన జుట్టును కత్తిరించుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. డబ్ల్యూటీఏ ఫైనల్స్ మ్యాచ్‌లో ఈ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ రద్వాంస్కా తో ఈ మ్యాచ్ లో కుజ్నెత్సోవా తలపడింది. మొదటి సెట్ గెలిచిన కుజ్నెత్సోవా రెండో సెట్ లో డీలా పడింది. నిర్ణయాత్మక మూడో సెట్ ఆడడానికి ముందు అంపైర్ నుంచి పెద్ద కత్తెర అడిగితీసుకుని తన జట్టును కత్తిరించుకుంది. కుజ్నెత్సోవా చర్యతో వీక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. జుట్టుపోయినా మ్యాచ్ గెలవడంతో ఆమెకు ఊరట లభించింది. జుట్టు కంటే మ్యాచ్ గెలవడమే ముఖ్యమనుకున్నానని ఆట ముగిసిన తర్వాత కుజ్నెత్సోవా చెప్పింది. అయితే టెన్నిస్ ప్లేయర్లు జట్టు కత్తిరించుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ లో రాఫెల్ నాదెల్ తో జరిగిన మ్యాచ్ లో బ్రిటన్ ఆటగాడు ఆండీ ముర్రే కనుబొమ్మలపై వెంట్రులను కత్తిరించుకున్నాడు. ఒకటిఆరా వెంట్రుకలే కాబట్టి పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు.
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్‌లో..
అధికారి ఆత్మహత్యకు కారకులపై కేసు ఏదీ?
ముమ్మరంగా ఎమ్మెల్యే ప్రచారం
ఉచిత కంటి వైద్య శిబిరం
విద్యాశాఖ ప్రాధికార ఏర్పాటుకు డిమాండ్
–8లో
నేడు హెచ్‌సీఎల్ టెక్–బీ జాబ్ మేళా
విద్యార్థులకు రుచికర భోజనం
పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్
YSRCPదే అధికారం.. విజయ్ బాబు విశ్లేషణ
వాడికి తల్లి లేదు.. చెల్లి లేదు.. రోజుకో అమ్మాయి కావాలి
తప్పక చదవండి
- తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు: కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి వ్యక్తిగత ఆహ్వానం
- పిన్నెల్లి పిటిషన్‌పై సీఈసీకి హైకోర్టు ఆదేశం
- కుల్దీప్ యాదవ్‌కు ఊహించని షాక్!
- పచ్చ పార్టీ నేతల కళ్లు బైర్లు కమ్మడం ఖాయమేనా?
- ఎవరు పడితే వాళ్లు కోచ్ కాలేరు?.. గంగూలీ పోస్ట్ వైరల్
- అందాల హీరోయిన్ వెజిటబుల్ సూప్ రెసిపీ, నెటిజన్లు ఏమన్నారంటే!
- ఇది కదా జగన్ అంటే.. ఆ రికార్డ్ ఆయనకే సొంతమవుతుంది.!
- క్యాష్‌లెస్ చికిత్సపై గంటలోనే నిర్ణయం..ఐఆర్డీఏఐ ఆదేశాలు
- మహిళా యూట్యూబర్ అరెస్టు
- సాయి రాజేష్ పాము లాంటి వ్యక్తి.. గాయత్రి సెన్సేషనల్ కామెంట్స్
Advertisement