ఎట్టకేలకు టీమిండియా ఓపెనర్లు రాణించారని అభిమానులు సంబరపడినంతలోపే కథ మొదటికి వచ్చింది.
పెర్త్: ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత బ్యాట్స్ మెన్లు ఘోరంగా విఫలమవుతున్నారు. ఓపెనర్లు రహానె, ధావన్ మినహా మిగతా బ్యాట్స్ మెన్లు బ్యాట్లు ఎత్తేస్తున్నారు. ఇంగ్లండ్తో కీలక మ్యాచ్లో భారత్ 43 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. తాజాగా జడేజా (5), ధోని (7) వెంటవెంటనే అవుటయ్యారు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రహానె (73), ధవన్ (38) శుభారంభం అందించారు. 20 ఓవర్లలో వీరిద్దరూ 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ తర్వాత కష్టాలు మొదలయ్యాయి.