
టోక్యోలో జరిగే 2020 ఒలింపిక్స్ తుది బడ్జెట్‌ను నిర్వాహక కమిటీ ప్రకటించింది. ఈ మెగా ఈవెంట్ కోసం 12.6 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 89 వేల 629 కోట్లు) ఖర్చు చేయబోతున్నట్లు వెల్లడించింది. వేడిని తట్టుకునేందుకు ఇటీవల కొన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి రావడంతో ఖర్చు కొంత పెరిగిందని కూడా జపాన్ పేర్కొంది. ఒలింపిక్స్ కమిటీ బడ్జెట్ ఖర్చును నిర్వాహక కమిటీ, టోక్యో మెట్రోపాలిటన్, కేంద్ర ప్రభుత్వం సమంగా భరిస్తాయి. జూలై 24నుంచి ఆగస్టు 9 వరకు ఒలింపిక్స్ క్రీడలు జరుగుతాయి.