సుశీల్‌ భవితవ్యం జితేందర్‌ చేతిలో...

Tokyo Hopeful Jitender Looks To Step Out Of Sushil Shadow - Sakshi

ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో జితేందర్‌ ‘బెర్త్‌’ సాధిస్తే సుశీల్‌ ఆశలు గల్లంతే!  

న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌ చరిత్రలో భారత్‌ తరఫున రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన ఏకైక క్రీడాకారుడు, భారత స్టార్‌ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ ‘2020–టోక్యో ఒలింపిక్స్‌’లో బరిలోకి దిగేది లేనిది సహచర రెజ్లర్‌ జితేందర్‌ కుమార్‌ నిర్ణయించే పరిస్థితి ఏర్పడింది. ఈనెల 15 నుంచి 18 వరకు ఇటలీలో జరిగే వరల్డ్‌ సిరీస్‌ ర్యాంకింగ్‌ టోర్నీలో... ఫిబ్రవరి 18 నుంచి 23 వరకు న్యూఢిల్లీలో జరిగే ఆసియా ఛాంపియన్ షిప్ లో... మార్చి 27 నుంచి 29 వరకు చైనాలో జరిగే ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో పాల్గొనే భారత జట్లను శుక్రవారం ట్రయల్స్‌ ద్వారా ఎంపిక చేశారు. 74 కేజీల విభాగంలో పోటీపడాల్సిన సుశీల్‌ కుమార్‌ గాయం కారణంగా ట్రయల్స్‌కు దూరమయ్యాడు.

దాంతో 74 కేజీల విభాగంలో జితేందర్‌ కుమార్‌ విజేతగా నిలిచి వరల్డ్‌ సిరీస్‌ ర్యాంకింగ్‌ టోర్నీ, ఆసియా ఛాంపియన్ షిప్, ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో పాల్గొనే అవకాశం దక్కించుకున్నాడు. 74 కేజీల ట్రయల్స్‌ ఫైనల్లో జితేందర్‌ 5–2తో అమిత్‌ ధన్‌కర్‌పై గెలిచాడు.  ఒకవేళ చైనా ఆతిథ్యమిచ్చే ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో జితేందర్‌ ఫైనల్‌కు చేరుకుంటే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాడు. జితేందర్‌ అర్హత సాధించిన పక్షంలో ఈ విభాగంలో సుశీల్‌ టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం ఉండ దు. గతంలో కూడా ఒలింపిక్స్‌ బెర్త్‌ సంపాదించిన రెజ్లర్లకు భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) ఎలాంటి ట్రయల్స్‌ నిర్వహించకుండా నేరుగా ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం కలి్పంచింది. అయితే జితేందర్‌ ర్యాంకింగ్‌ సిరీస్‌ టోర్నీలో, ఆసియా చాంపియన్‌íÙప్‌లో విఫలమైతే మాత్రం ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోరీ్నకి ముందు మరోసారి ట్రయల్స్‌ నిర్వహించే అవకాశముందని... ఈ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు సుశీల్‌కు అవకాశమిస్తామని డబ్ల్యూఎఫ్‌ఐ తెలిపింది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top