దీటుగా జవాబిస్తున్న టీమిండియా | team india gets 176 runs after 30 overs | Sakshi
Sakshi News home page

దీటుగా జవాబిస్తున్న టీమిండియా

Oct 11 2015 3:12 PM | Updated on Sep 3 2017 10:47 AM

దీటుగా జవాబిస్తున్న టీమిండియా

దీటుగా జవాబిస్తున్న టీమిండియా

ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఆదివారం ఇక్కడ గ్రీన్ పార్క్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలివన్డేలో టీమిండియా దీటుగా జవాబిస్తోంది.

కాన్పూర్: ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఆదివారం ఇక్కడ గ్రీన్ పార్క్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలివన్డేలో టీమిండియా దీటుగా జవాబిస్తోంది. దక్షిణాఫ్రికా విసిరిన 304 పరుగల లక్ష్యాన్ని చేరే క్రమంలో టీమిండియా ఆటగాళ్లు నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు.  30 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ మాత్రమే కోల్పోయి 176  పరుగులతోఆటను కొనసాగిస్తోంది.  క్రీజ్ లో రోహిత్ శర్మ(92), అజింక్యా రహానే(50) లు ఉన్నారు. 

 

ప్రస్తుతం వీరిద్దరూ వంద పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. మంచి బంతులను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ, చెత్త బౌంతులను బౌండరీ దాటిస్తున్నారు.  అంతకుముందు టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది. ఓపెనర్లు డీ కాక్(29), హషీమ్ ఆమ్లా(37) ఫర్వాలేదనిపించినా.. డు ప్లెసిస్(62) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం కెప్టెన్ ఏబీ డివిలియర్స్ తనదైన శైలిలోదూకుడుగా ఆడాడు. డివిలియర్స్  (104; 73 బంతుల్లో 5ఫోర్లు, 6 సిక్స్ లు)) అజేయ సెంచరీతో పాటు బెహర్దియాన్(35 నాటౌట్;19 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో సఫారీలు మూడొందల మార్కును దాటారు. ట్వంటీ 20 సిరీస్ హీరో డుమిని(15),  డేవిడ్ మిల్లర్(13) లు నిరాశపరిచారు.40 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లను కోల్పోయి 194 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా ఆపై దూకుడుగా ఆడింది. చివరి పది ఓవర్లలో  రెండు వికెట్లు మాత్రమే కోల్పోయిన దక్షిణాఫ్రికా  109 పరుగులు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement