గుజరాత్ లయన్స్ కెప్టెన్‌గా రైనా | Suresh Raina to lead Gujarat Lions in the IPL | Sakshi
Sakshi News home page

గుజరాత్ లయన్స్ కెప్టెన్‌గా రైనా

Feb 3 2016 12:53 AM | Updated on Aug 21 2018 2:28 PM

గుజరాత్ లయన్స్ కెప్టెన్‌గా రైనా - Sakshi

గుజరాత్ లయన్స్ కెప్టెన్‌గా రైనా

ఐపీఎల్‌లో రాజ్‌కోట్ ఫ్రాంచైజీకి చెందిన జట్టును మంగళవారం ఆవిష్కరించారు. ‘గుజరాత్ లయన్స్’ పేరుతో ఈ టీమ్ బరిలో....

చీఫ్ కోచ్‌గా బ్రాడ్ హాడ్జ్
న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో రాజ్‌కోట్ ఫ్రాంచైజీకి చెందిన జట్టును మంగళవారం ఆవిష్కరించారు. ‘గుజరాత్ లయన్స్’ పేరుతో ఈ టీమ్ బరిలోకి దిగనుంది. ఈ జట్టుకు కెప్టెన్‌గా స్టార్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా, చీఫ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మన్ బ్రాడ్ హాడ్జ్‌లను నియమించారు. ఎనిమిదేళ్లు కలిసి ఆడినందున ధోనిని ఎలా కట్టడి చేయాలో తనకు తెలుసని రైనా అన్నాడు. ‘నేను, మహీ కలిసి కొన్ని ఫైనల్స్ ఆడాం. కాబట్టి అతన్ని అడ్డుకోవడం ఎలాగో తెలుసు. ఈసారి ధోనిని జడేజా అవుట్ చేస్తే బ్రేవో డాన్స్ చేస్తాడు.

చెన్నై తరఫున నేను, జడేజా, మెకల్లమ్, బ్రేవో కలిసి ఆడాం. ఇప్పుడు ఫాల్క్‌నర్ రావడంతో జట్టులో సమతుల్యత పెరిగింది. వేలంలో కూడా మంచి ఆటగాళ్లు వస్తారని ఆశిస్తున్నా. వేలంలో ఉన్న దేశవాళీ, విదేశీ ఆటగాళ్లలో నైపుణ్యానికి కొదువలేదు’ అని రైనా పేర్కొన్నాడు. చెన్నై సూపర్‌కింగ్స్ ఫ్రాంచైజీ తనను మెరుగైన క్రికెటర్‌గా తీర్చిదిద్దిందన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement