ఇక సన్ రైజర్స్‌కు కష్టమే!

ఇక సన్ రైజర్స్‌కు కష్టమే! - Sakshi


రాంచీ: చాంపియన్స్ లీగ్‌లో ఇక సన్‌రైజర్స్ సెమీస్‌కు చేరితే అది అద్భుతమే అనుకోవాలి. గ్రూప్ ‘బి’ లో వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడిపోవడం, రన్‌రేట్ కూడా దారుణంగా పడిపోవడంతో ఈ హైదరాబాద్ ఫ్రాంఛైజీ ఈ సారి లీగ్ దశతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చేట్లుంది. జేఎస్‌సీఏ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాకు చెందిన టైటాన్స్ చేతిలో ఓడిపోయింది.

 

 టాస్ గెలిచిన టైటాన్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా... సన్‌రైజర్స్ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (21 బంతుల్లో 37; 7 ఫోర్లు, 1 సిక్సర్), పార్థీవ్ పటేల్ (24 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలి వికెట్‌కు 39 బంతుల్లోనే 62 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. అయితే టైటాన్స్ బౌలర్లు పుంజుకుని వరుస విరామాల్లో వికెట్లు తీసి స్కోరును నియంత్రించారు. పెరీరా (11), డుమిని (17), స్యామీ (1) విఫలమయ్యారు. దీంతో ఓ దశలో సన్‌రైజర్స్ 112 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. చివర్లో స్టెయిన్ (12 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కరణ్ శర్మ (6 బంతుల్లో 11 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్) వేగంగా ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. టైటాన్ ఆల్‌రౌండర్ వీస్ మూడు కీలక వికెట్లు తీసుకున్నాడు.

 

 టైటాన్స్ జట్టు 16.3 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 147 పరుగులు చేసి అలవోకగా గెలిచింది. కెప్టెన్ డేవిడ్స్ (42 బంతుల్లో 64; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఓపెనర్ రుడాల్ఫ్ (42 బంతుల్లో 49 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) చివరి వరకూ బాధ్యతగా బ్యాటింగ్ చేశాడు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు 12.1 ఓవర్లలో 112 పరుగులు జోడించి విజయాన్ని సులభం చేశారు. ఈ విజయంతో టైటాన్స్ జట్టు సెమీస్ ఆశలను సజీవంగా నిలబెట్టుకుంది. సన్‌రైజర్స్ బౌలర్లలో స్టెయిన్, ఇషాంత్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. డేవిడ్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

 

 స్కోరు వివరాలు

 సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: పార్థీవ్ (బి) వీస్ 26; శిఖర్ ధావన్ (సి) మోర్కెల్ (బి) వీస్ 37; డుమిని (బి) డిలాంజ్ 17; విహారి (సి) డేవిడ్స్ (బి) వీస్ 6; సామంత్రె (స్టం) మోసెహెలె (బి) డేవిడ్స్ 0; పెరీరా రనౌట్ 11; స్యామీ (సి) బెహర్డిన్ (బి) రిచర్డ్స్ 1; కరణ్ శర్మ నాటౌట్ 11; స్టెయిన్ నాటౌట్ 27; ఎక్స్‌ట్రాలు (బై 1, లెగ్‌బై 1, వైడ్లు 7) 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి) 145

 వికెట్ల పతనం: 1-62; 2-71; 3-83; 4-86; 5-102; 6-105; 7-112.

 బౌలింగ్: డేవిడ్స్ 4-0-18-1; మోర్నీ మోర్కెల్ 4-0-42-0; రిచర్డ్స్ 4-0-24-1; డిలాంజ్ 4-0-42-1; వీస్ 4-0-17-3.

 

 టైటాన్స్ ఇన్నింగ్స్: రుడాల్ఫ్ నాటౌట్ 49; డేవిడ్స్ (సి) స్యామీ (బి) స్టెయిన్ 64; డివిలియర్స్ (సి) పెరీరా (బి) ఇషాంత్ 9; కున్ నాటౌట్ 15; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బైస్ 6, వైడ్లు 4) 10; మొత్తం (16.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి) 147

 వికెట్ల పతనం: 1-112; 2-123.

 

 బౌలింగ్: క రణ్ శర్మ 1-0-9-0; స్టెయిన్ 4-0-23-1; ఇషాంత్ 4-0-32-1; పెరీరా 2.3-0-29-0; అమిత్ మిశ్రా 2-0-17-0; డుమిని 1-0-14-0; స్యామీ 2-0-17-0.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top