
చెస్ చాంప్ సుహాస్
తెలంగాణ రాష్ట్ర అండర్–7 చెస్ సెలక్షన్ చాంపియన్‌షిప్‌లో ఎ. సుహాస్, అర్పిత సత్తాచాటారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అండర్–7 చెస్ సెలక్షన్ చాంపియన్‌షిప్‌లో ఎ. సుహాస్, అర్పిత సత్తాచాటారు. జాతీయ స్థాయి చెస్ టోర్నీ కోసం నిర్వహించిన ఈ టోర్నీలో వీరిద్దరూ విజేతగా నిలిచి రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. వీరితో పాటు ఈ టోర్నీలో రెండో స్థానాల్లో నిలిచిన ప్రియాన్‡్ష, అక్షర కూడా రాష్ట్ర జట్టులో చోటు దక్కించుకున్నారు. సోమవారం జరిగిన బాలుర మ్యాచ్‌ల్లో రంగారెడ్డి కింగ్స్ చెస్ అకాడమీకి చెందిన సుహాస్ (4 పాయింట్లు) అర్జున్ ఆదిరెడ్డిపై గెలుపొందగా, మరో గేమ్‌లో ఆదిత్య (3.5 పాయింట్లు) నంబియార్ ఆరవ్ (3 పాయింట్లు)ను ఓడించాడు.
బాలికల విభాగంలో అక్షర (4 పాయింట్లు) అర్పిత (4 పాయింట్లు)ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా అర్పిత విజేతగా నిలిచింది. రాష్ట్ర జట్టుకు ఎంపికైన ఈ నలుగురు చిన్నారులు విజయవాడలో సెప్టెంబర్ 3 నుంచి 12 వరకు జరిగే జాతీయ స్థాయి టోర్నీలో పాల్గొంటారు.