నెటిజన్లపై బాలీవుడ్ ఆగ్రహం | Stop blaming Anushka: B-Town celebs on India's World Cup loss | Sakshi
Sakshi News home page

నెటిజన్లపై బాలీవుడ్ ఆగ్రహం

Mar 27 2015 6:02 PM | Updated on Apr 3 2019 6:23 PM

విరాట్ కోహ్లీ విఫలమవడానికి అతని ప్రియురాలు, బాలీవుడ్ నటి అనుష్క శర్మ కారణమంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేయడంపై బాలీవుడ్ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముంబై: భారత్, ఆస్ట్రేలియాల ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో విరాట్ కోహ్లీ విఫలమవడానికి అతని ప్రియురాలు, బాలీవుడ్ నటి అనుష్క శర్మ కారణమంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేయడంపై బాలీవుడ్ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుష్కకు మద్దతు తెలుపుతూ నెటిజన్లపై పరుష పదజాలం వాడారు.

అనుష్కను విమర్శించేవాళ్లు చదువుకోని మూర్ఖులు అంటూ బాలీవుడ్ నటుడు రిషీ కపూర్ ఘాటుగా స్పందించారు. ఇంకా భాలీవుడ్ భామలు ప్రియాంక చోప్రా, సుస్మితా సేన్, దియా మీర్జా తదితరులు అనుష్కకు అండగా నిలిచారు. స్నేహితుడికి మద్దతుగా మ్యాచ్ చూడటం తప్పా అని ప్రియాంక నెటిజన్లను విమర్శించారు. సెమీస్లో టీమిండియా ఓడిపోవడం అభిమానులకు నిరాశకు గురిచేసిఉండొచ్చు, అయితే అనుష్కను నిందించడం దారుణమని దియా మీర్జా తప్పుపట్టారు. ఇలాంటి కామెంట్లు ఆపాలని సూచించారు. ఈ మ్యాచ్లో గెలవడం ఆస్ట్రేలియా ఘనతని, ఇందుకు వ్యక్తిగతంగా ఎవర్నీ నిందించివద్దని అర్జున్ కపూర్ అన్నారు. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా నెటిజన్ల వ్యాఖ్యలను తప్పుపడుతూ, అనుష్కను నిందించడం ఆపాలని పేర్కొన్నారు. సెమీస్ సందర్భంగా విరాట్ కోహ్లీకి మద్దతు తెలిపేందుకు అనుష్క శర్మ ఆస్ట్రేలియా వెళ్లడం.. సిడ్నీలో జరిగిన ఈ మ్యాచ్లో కోహ్లీ విఫలమవడం.. గ్యాలరీలో అనుష్క కనిపించడం.. టీమిండియా ఓడిపోయాక నెటిజన్లు అనుష్క లక్ష్యంగా కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement