చెస్ చాంప్స్ శ్రీయ, పృథ్వీతేజ్ | sreeya and prithivi tej clinch inter school chess championships | Sakshi
Sakshi News home page

చెస్ చాంప్స్ శ్రీయ, పృథ్వీతేజ్

Aug 11 2016 12:06 PM | Updated on Sep 4 2017 8:52 AM

సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్ స్కూల్ చెస్ చాంపియన్‌షిప్‌లో శ్రీయ, పృథ్వీ తేజ్ సీనియర్ విభాగంలో విజేతలుగా నిలిచారు.

సాక్షి, హైదరాబాద్: సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్ స్కూల్ చెస్ చాంపియన్‌షిప్‌లో శ్రీయ, పృథ్వీ తేజ్ సీనియర్ విభాగంలో విజేతలుగా నిలిచారు. సీనియర్ బాలికల విభాగంలో శ్రీయ (విస్టా స్కూల్)... విధి (సిద్ధార్థ పబ్లిక్ స్కూల్)పై విజయం సాధించింది. హర్షిత (సిద్ధార్థ పబ్లిక్ స్కూల్) మూడో స్థానంలో నిలిచింది.

 

బాలుర విభాగంలో పృథ్వీ తేజ్ (గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్), కర ణ్ (గ్లెండాల్ అకాడమీ), సయ్యద్ ఫసివుల్లా (సుప్రభాత్ మోడల్ హైస్కూల్) తొలి మూడు స్థానాల్లో నిలిచారు. ఈ టోర్నీ ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను గ్లెన్‌డెల్ అకాడమీ దక్కించుకుంది.


 ఇతర విభాగాల విజేతలు
 జూనియర్ బాలికలు: 1. ఎస్. అనూష, 2. రిషిత, 3. మానస.
 బాలురు: 1. శ్రీ చైతన్య, 2. కౌశిక్, 3. ప్రణీత్.
 సబ్ జూనియర్ బాలురు: 1. ఆశ్రీత్ రెడ్డి, 2. శశాంక్, 3. కృష్ణ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement