భారత్‌ ‘ఎ’ క్లీన్‌స్వీప్‌ 

 Siddharth Kaul shine as India A complete 3-0 rout of New Zealand A - Sakshi

కివీస్‌ ‘ఎ’పై మూడో వన్డేలోనూ గెలుపు  

మౌంట్‌మాంగనీ: పేసర్‌ సిద్ధార్థ్‌ కౌల్‌ (4/37) విజృంభణతో భారత్‌ ‘ఎ’ వరుసగా మూడో వన్డేలోనూ న్యూజిలాండ్‌ ‘ఎ’ జట్టును సునాయాసంగా ఓడించింది. సిరీస్‌ను 3–0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది. రెండు జట్ల మధ్య మంగళవారం ఇక్కడ జరిగిన అనధికారిక వన్డేలో టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ‘ఎ’ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది.

ఓపెనర్‌ అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ (80 బంతుల్లో 71; 8 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధశతకం సాధించగా, అంకిత్‌ బావ్నె (49 బంతుల్లో 48; 7 ఫోర్లు), ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ (43 బంతుల్లో 42; 4 ఫోర్లు), ఇషాన్‌ కిషన్‌ (54 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. ఛేదనలో కౌల్, కృష్ణప్ప గౌతమ్‌ (2/40) దెబ్బకు కివీస్‌ ‘ఎ’ 44.2 ఓవర్లలో 200 పరుగులకే ఆలౌటైంది. సీఫ్రెట్‌ (73 బంతుల్లో 55; 4 ఫోర్లు, 1 సిక్స్‌) ఒక్కడే నిలవగలిగాడు. దీంతో ¿ 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top