కరోనాపై బుడతడి క్లారిటీ.. సెహ్వాగ్‌ ఫిదా

Sehwag Posts Video Of Child Spelling Out Covid 19 Directives - Sakshi

న్యూఢిల్లీ:  సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌.. తాజాగా ఒక వీడియో పోస్ట్‌ చేశాడు. అది కూడా కరోనా వైరస్‌ నియంత్రణకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వీడియోను షేర్‌ చేశాడు. అయితే ఇది కరోనా వైరస్‌పై సెహ్వాగ్‌ మాట్లాడిన వీడియో కాదు.. ఒక బుడతడు  తన బుజ్జి బుజ్జి మాటలతో ఏం చేయాలో తెలియజేశాడు. ఈ వీడియో సెహ్వాగ్‌ కంటబడటంతో దాన్ని తన ట్వీటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశాడు.అంతే కాదు.. ఆ చిన్నారి చెప్పే మాటల్ని శ్రద్ధగా ఆలకించాలంటూ విజ్ఞప్తి చేశాడు. ‘ ఇది మనందరికీ చాలా ముఖ్యమైనది. ఆ చిన్న పిల్లాడు ఎంతో అందంగా కరోనా వైరస్‌ నియంత్రణ గురించి వివరించాడు. వాడి మాటలు ప్రతీ ఒక్కరూ వినండి.. అలానే పాటించడం కూడా మానకండి’ అని కామెంట్‌ కూడా జత చేశాడు. (అది ‘మాస్టర్‌’ ప‍్లాన్‌: సెహ్వాగ్‌)

మూడు రోజుల క్రితం 49 మంది భారత క్రీడాకారులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్పరెన్స్‌లో మాట్లాడారు. కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా దేశ ప్రజలను జాగృతం చేయాల్సిన బాధ్యత క్రీడాకారులకు కూడా ఉందని మోదీ సూచించారు. అంతకుముందుగానే  మోదీ పిలుపు మేరకు సామాజిక దూరాన్ని పాటిస్తూ కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణలో భాగమయ్యానని సెహ్వాగ్‌ తెలిపాడు. ఇక దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో సామాజిక దూరం అనేది సహజంగానే కనబడుతుందని ఈ డాషింగ్‌ ఓపెనర్‌ పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top