సానియా జంటకు మళ్లీ నిరాశ | Sania Mirza-Barbora Strycova crash out in Dubai Open semifinal | Sakshi
Sakshi News home page

సానియా జంటకు మళ్లీ నిరాశ

Feb 25 2017 12:35 AM | Updated on Sep 5 2017 4:30 AM

సానియా జంటకు మళ్లీ నిరాశ

సానియా జంటకు మళ్లీ నిరాశ

వరుసగా రెండో టోర్నమెంట్‌లోనూ భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాకు నిరాశ ఎదురైంది.

దుబాయ్‌: వరుసగా రెండో టోర్నమెంట్‌లోనూ భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాకు నిరాశ ఎదురైంది. తన భాగస్వామి బార్బరా స్ట్రికోవా (చెక్‌ రిపబ్లిక్‌)తో కలిసి దుబాయ్‌ ఓపెన్  టోర్నమెంట్‌లో పాల్గొన్న సానియా పోరాటం సెమీఫైనల్లో ముగిసింది.

శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్‌ సెమీఫైనల్లో మూడో సీడ్‌ సానియా–స్ట్రికోవా ద్వయం 4–6, 3–6తో రెండో సీడ్‌ మకరోవా–వెస్నినా (రష్యా) జంట చేతిలో ఓడిపోయింది. సెమీస్‌లో నిష్క్రమించిన సానియా జంటకు 34,880 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 23 లక్షల 23 వేలు)తోపాటు 350 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. గతవారం ఖతర్‌ టోర్నీలోనూ సానియా–స్ట్రికోవా జోడీ సెమీస్‌లోనే ఓడిపోయింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement