సాకేత్‌ ఓటమి  | Saket myneni loss the match | Sakshi
Sakshi News home page

సాకేత్‌ ఓటమి 

May 3 2019 4:56 AM | Updated on May 3 2019 4:56 AM

Saket myneni loss the match - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సియోల్‌ ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్, భారత డేవిస్‌కప్‌ జట్టు సభ్యుడు సాకేత్‌ మైనేని పోరాటం ముగిసింది. కొరియాలో గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో సాకేత్‌ 4–6, 5–7తో వు తుంగ్‌ లిన్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో పరాజయం పాలయ్యాడు. 82 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్‌ కేవలం ఒక్క ఏస్‌ మాత్రమే సంధించాడు.

తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయాడు. మరో మూడో రౌండ్‌ మ్యాచ్‌లో భారత రెండో ర్యాంకర్‌ రామ్‌కుమార్‌ 4–6, 7–6 (7/5), 6–7 (6/8)తో లీ జె (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో రామ్‌కుమార్‌ (భారత్‌)–బ్రెడెన్‌ ష్నెర్‌ (కెనడా) ద్వయం 6–3, 5–7, 10–6తో జీ సుంగ్‌ నామ్‌–మిన్‌ క్యు సాంగ్‌ (కొరియా) జోడీపై గెలిచి సెమీఫైనల్‌కు చేరింది.  

Advertisement
 
Advertisement
Advertisement