కొనసాగుతున్న సైనా జైత్రయాత్ర | saina nehwal beats Juliane Schenk in ibl | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న సైనా జైత్రయాత్ర

Aug 28 2013 10:16 PM | Updated on Sep 1 2017 10:12 PM

కొనసాగుతున్న సైనా జైత్రయాత్ర

కొనసాగుతున్న సైనా జైత్రయాత్ర

భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జైత్రయాత్ర కొనసాగుతోంది.

హైదరాబాద్ : భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఐబీఎల్ సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన సెమీస్ ఫైనల్ మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ 21-10, 19-21, 11-8 తేడాతో జులియన్ షెంక్‌పై విజయం సాధించి తన సత్తాను మరోసారి చాటింది.  ఓ దశలో జులియంక్ నుంచి కొంత ప్రతిఘటన ఎదురైనప్పటికీ సైనా వాటిని అధిగమించి జయకేతనం ఎగురవేసింది.

 

పాయింట్ల పట్టికలో స్థానాలతో సంబంధం లేకుండా హైదరాబాద్ ఆడే సెమీఫైనల్ మ్యాచ్‌ను నగరంలోనే నిర్వహించారు. హైదరాబాద్ తొలి రెండు స్థానాల్లో నిలిస్తే... మూడు, నాలుగు స్థానాల్లో నిలచిన జట్లలో ఒక జట్టును డ్రా ద్వారా నిర్ణయించి హాట్‌షాట్స్‌తో ఆడిస్తారు. ఈ మ్యాచ్‌లో సైనా విజయం సాధించడంతో నగర ప్రేక్షకులను కనువిందు చేసింది.  రేపు జరిగే మరో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పోరుకు ఈ విజయం ఊరట నిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement