ప్రిక్వార్టర్స్‌లో సాయి ఉత్తేజిత  | Sai uttejitha enter to quarter finals | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో సాయి ఉత్తేజిత 

Oct 11 2018 1:48 AM | Updated on Oct 11 2018 1:48 AM

Sai uttejitha enter to quarter finals - Sakshi

డచ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–100 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో మహిళల సింగిల్స్‌ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి చుక్కా సాయి ఉత్తేజిత రావు ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. నెదర్లాండ్స్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో ఉత్తేజిత 21–10, 21–13తో మార్టినా రెపిస్కా (స్లొవేకియా)పై గెలిచింది.

మరో మ్యాచ్‌లో హైదరాబాద్‌కు చెందిన శ్రీకృష్ణప్రియ 11–21, 12–21తో ఫాబిని డిప్రెజ్‌ (జర్మనీ) చేతిలో ఓడిపోయింది. భారత్‌కే చెందిన శైలి రాణే, అనురా ప్రభు దేశాయ్, రియా ముఖర్జీ కూడా తొలి రౌండ్‌లోనే పరాజయం పాలయ్యారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement