ఫెడరర్‌ శుభారంభం

Roger Federer hits out at Rafael Nadal's suggestion ATP Finals - Sakshi

లండన్‌: రికార్డుస్థాయిలో ఎనిమిదోసారి టైటిల్‌పై దృష్టి పెట్టిన స్విట్జర్లాండ్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ టెన్నిస్‌ సీజన్‌ ముగింపు టోర్నీ ఏటీపీ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో శుభారంభం చేశాడు. ఆదివారం జరిగిన ‘బోరిస్‌ బెకర్‌ గ్రూప్‌’ లీగ్‌ మ్యాచ్‌లో ఫెడరర్‌ 6–4, 7–6 (7/4)తో ఈ టోర్నీలో తొలిసారి ఆడుతోన్న జాక్‌ సోక్‌ (అమెరికా)పై గెలుపొందాడు. గంటా 31 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్‌ ఐదు ఏస్‌లు సంధించి, ఒక డబుల్‌ ఫాల్ట్‌ చేశాడు. తొలి సెట్‌లో ఒకసారి జాక్‌ సోక్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన ఫెడరర్‌ రెండో సెట్‌లో టైబ్రేక్‌లో పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఈ ఏడాది ఫెడరర్‌కిది 50వ విజయం కావడం విశేషం.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top