రంజీ ట్రోఫీ క్వార్టర్స్‌లో ముంబై | Ranji Trophy: Mumbai maul Tripura by 10 wickets to enter quarters | Sakshi
Sakshi News home page

రంజీ ట్రోఫీ క్వార్టర్స్‌లో ముంబై

Nov 28 2017 12:54 AM | Updated on Nov 28 2017 12:54 AM

Ranji Trophy: Mumbai maul Tripura by 10 wickets to enter quarters - Sakshi

ముంబై: త్రిపురతో జరిగిన గ్రూప్‌ ‘సి’ రంజీ ట్రోఫీ చివరి లీగ్‌ మ్యాచ్‌లో ముంబై 10 వికెట్ల తేడాతో గెలిచి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. 63 పరుగుల విజయలక్ష్యాన్ని ముంబై 6.2 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా అధిగమించింది. పృథ్వీ షా (26 బంతుల్లో 50 నాటౌట్‌; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. ఈ గ్రూప్‌లో ముంబై 21 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది.  మరోవైపు ఇదే గ్రూప్‌లో ఒడిశాతో జరుగుతున్న మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌ గెలిస్తే 21 పాయింట్లతో రెండో క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ను దక్కించుకుంటుంది. ‘డ్రా’గా ముగిస్తే మాత్రం ఆంధ్ర జట్టు (19 పాయింట్లు) ముందంజ వేస్తుంది. మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో మూడో రోజు తమ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 237 పరుగులు చేసిన ఒడిశా ఇంకా నాలుగు పరుగులు వెనుకంజలో ఉంది. ఆట చివరి రోజు మధ్యప్రదేశ్‌కు కీలకం కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement