‘మిస్టర్‌ తెలంగాణ’ రాహుల్‌ | Sakshi
Sakshi News home page

‘మిస్టర్‌ తెలంగాణ’ రాహుల్‌

Published Mon, Nov 20 2017 10:59 AM

Rahul Wins mister telangana title - Sakshi

సాక్షి, హైదరాబాద్: ‘మిస్టర్‌ తెలంగాణ’ ఓపెన్‌ బాడీ బిల్డింగ్‌ చాంపియన్‌షిప్‌–2017 పోటీల్లో అల్వాల్‌కు చెందిన రాహుల్‌ విజేతగా నిలిచాడు. సుల్తాన్‌షాహి జీహెచ్‌ఎంసీ ప్లే గ్రౌండ్‌లో జరిగిన ఈ పోటీల్లో పలు జిల్లాలకు చెందిన బాడీ బిల్డర్లు బరిలోకి దిగారు.

‘మిస్టర్‌ తెలంగాణ’ టైటిల్‌ గెలిచిన రాహుల్‌కు టోర్నీ చైర్మన్‌ సుంకరి రంగారావు ట్రోఫీని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బండారు దత్తాత్రేయ, మాజీ కార్పొరేటర్‌ పాశం సురేందర్, ట్రాఫిక్‌ ఏసీపీ రాజ్‌ కుమార్, టోర్నీ నిర్వాహకులు రషీద్‌ షరీఫ్, నరేశ్‌ కుమార్, శివకాంత్, లక్ష్మణ్‌ రావు పాల్గొన్నారు.  
 

Advertisement
 
Advertisement
 
Advertisement